: శోభానాగిరెడ్డి మరణంపై గవర్నర్ దిగ్భ్రాంతి


ఆళ్లగడ్డ ఎమ్మెల్యే, వైఎస్సార్పీసీ నేత భూమా శోభానాగిరెడ్డి మరణవార్త విని రాష్ట్ర గవర్నర్ నరసింహన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె మృతికి సంతాపం తెలిపారు. శోభానాగిరెడ్డి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

శోభానాగిరెడ్డి మరణవార్త విని పలువురు కేర్ ఆస్పత్రికి చేరుకున్నారు. మాజీ సీఎం కిరణ్, బీజేపీ నేత కిషన్ రెడ్డి, సినీ నటుడు రాజా, మాజీ డీజీపీ దినేష్ రెడ్డి తదితరులు కేర్ ఆస్పత్రికి వచ్చి శోభానాగిరెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు.

  • Loading...

More Telugu News