: శోభా నాగిరెడ్డి మృతితో... విషాదంలో కర్నూలు జిల్లా వాసులు


ఆళ్లగడ్డ ఎమ్మెల్యే శోభా నాగిరెడ్డి మృతితో కర్నూలు జిల్లా వాసులు విషాదంలో మునిగిపోయారు. అభిమానులు, కుటుంబ సభ్యులు, కార్యకర్తలు కన్నీరు మున్నీరయ్యారు. ఆమె ఆఖరి శ్వాస వరకు ప్రజాసేవలోనే గడిపారు. నిన్న షర్మిలతో కలిసి ర్యాలీలో పాల్గొన్న శోభా నాగిరెడ్డి... బుధవారం రాత్రి వరకు కార్యకర్తలు, అభిమానులతో కలిసి ఉన్నారు. నిత్యం ప్రజల కోసం తపించే శోభానాగిరెడ్డి భౌతికంగా దూరమయ్యారనే వార్తతో కార్యకర్తలు శోక సంద్రంలో మునిగిపోయారు. బుధవారం రాత్రి జరిగిన రోడ్డుప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ శోభానాగిరెడ్డి... హైదరాబాదు కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ ఉదయం 11.05 గంటలకు కన్నుమూసిన విషయం విదితమే.

  • Loading...

More Telugu News