: నల్లగా ఉన్నాడని భర్తకు నిప్పంటించిన సతీమణి
మధ్యప్రదేశ్ లో ఓ మహిళ భర్త రంగు నచ్చలేదని అతడిని బలితీసుకుంది. బింద్ జిల్లాలో ఈ ఘోరం జరిగింది. 24 ఏళ్ల చమేలీదేవి భర్త జాగ్రామ్ రాథోడ్ నిద్రిస్తుండగా అతడిపై కిరోసిన్ పోసి నిప్పటించింది. ప్రాణభయంతో పరుగులు తీస్తుండగా స్థానికులు అతడిని ఆస్పత్రికి తరలించారు. కాలిన గాయాలతో చికిత్స తీసుకుంటూ ఆస్పత్రిలో కన్నుమూశాడు. భార్యే తనపై హత్యాయత్నం చేసిందని అతడు వాంగ్మూలం ఇచ్చాడు. చమేలీకి తమ కొడుకు నల్లగా ఉండడం నచ్చలేదని జాగ్రామ్ తల్లిదండ్రులు పోలీసులకు తెలిపారు. ఒత్తిడితోనే చమేలీ పెళ్లి చేసుకుందని వెల్లడించారు. ఎట్టకేలకు పరారీలో ఉన్న చమేలీని పోలీసులు అరెస్ట్ చేశారు.