: చెన్నైలో ఓటు వేసిన జయలలిత, రజనీకాంత్, కమల్
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తమిళనాడులో 39 లోక్ సభ స్థానాలకు ఈ ఉదయం నుంచి పోలింగ్ జరుగుతోంది. అక్కడి మేరీ స్టెల్లా కళాశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలిత ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇక కోలీ వుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ చెన్నై సెంట్రల్ నియోజకవర్గంలో ఓటు వేశారు. అనంతరం కమల్ హాసన్, రేవతి ఓటు వేయగా... నటి కుష్బూ క్యూలైన్ లో నిలబడి తనవంతు వచ్చాక ఓటు వేశారు.