: సోమరాజు పర్యవేక్షణలో శోభానాగిరెడ్డికి చికిత్స
నిన్న రాత్రి కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ వైఎస్సార్సీపీ ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అభ్యర్థి శోభానాగిరెడ్డికి హైదరాబాద్ కేర్ ఆసుపత్రిలో డాక్టర్ సోమరాజు పర్యవేక్షణలో ఆర్థో, న్యూరో, క్రిటికల్ కేర్ కు చెందిన మూడు బృందాలు పరీక్షలు జరుపుతున్నాయి. పూర్తి స్థాయిలో పరీక్షలు చేసిన అనంతరం చికిత్స ప్రారంభిస్తారని సమాచారం. ఇప్పటికీ ఆమె పరిస్థితి విషమంగానే ఉన్నట్టు తెలుస్తోంది. మరో గంట తరువాత వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేస్తారు. కార్యకర్తలు, అభిమానులు కేర్ ఆసుపత్రికి చేరుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీ నాయకురాలు నన్నపనేని రాజకుమారి, వైఎస్సార్సీపీ నాయకుడు మైసురారెడ్డి ఆసుపత్రికి వచ్చిన వారిలో ఉన్నారు.