: రేపు రంగారెడ్డి జిల్లాలో లోకేష్ ఎన్నికల ప్రచారం


టీడీపీ యువ నేత నారా లోకేష్ ఎన్నికల ప్రచారంలో భాగంగా రేపు రంగారెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు. ‘యువ ప్రభంజనం’ పేరిట యాత్ర చేపట్టిన లోకేష్ గురువారం నాడు తాండూరు, చేవెళ్ల, రాజేంద్రనగర్ లలో జరిగే బహిరంగసభల్లో పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. నారా లోకేష్ యువ ప్రభంజనం యాత్రలో టీడీపీ కార్యకర్తలు, అభిమానులు, రైతులు, విద్యార్థులు, మహిళలు పాల్గొని విజయవంతం చేయాలని టీడీపీ పార్టీ వర్గాలు పిలుపునిచ్చాయి.

  • Loading...

More Telugu News