: అనకాపల్లిలో చిరంజీవి ‘షో’ చేశారు
విశాఖ జిల్లా అనకాపల్లిలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ ప్రచార కమిటీ అధ్యక్షుడు, కేంద్రమంత్రి చిరంజీవి ఇవాళ ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్ షో నిర్వహించారు. ఈ రోడ్ షోలో రాష్ట్ర మాజీ మంత్రులు సి.రామచంద్రయ్య, డొక్కా మాణిక్య వరప్రసాద్ పాల్గొన్నారు. ఈ రోడ్ షోకు కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివచ్చారు.