: ఖబడ్దార్ కేసీఆర్... తెలంగాణలో తిరగలేవు: చంద్రబాబు
ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లి బహిరంగ సభలో ప్రసంగించిన టీడీపీ అధినేత చంద్రబాబు టీఆర్ఎస్, ఆ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ పై మాటల తూటాలు పేల్చారు. టీఆర్ఎస్ ఓ తాగుబోతుల పార్టీ అంటూ ఎద్దేవా చేశారు. ఆ పార్టీ నేతలు, కార్యకర్తలకు తాగడం, గొడవ చేయడం తప్ప మరే పని ఉండదని అన్నారు. అదొక వసూళ్ల పార్టీ అని ఆరోపించారు. కేసీఆర్ నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారన్న చంద్రబాబు... "ఖబడ్దార్ కేసీఆర్... తెలంగాణలో తిరగలేవు" అని హెచ్చరించారు.