: తెలంగాణ బిల్లుపై జాప్యం చేస్తే చంపుతామని బెదిరించారు: వెంకయ్య నాయుడు


ఎన్నికల ప్రచారంలో భాగంగా భారతీయ జనతా పార్టీ అగ్రనేత వెంకయ్య నాయుడు నెల్లూరు జిల్లా వేదాయపాలెంలో రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... వచ్చే ఎన్నికల్లో ఎన్డీయే కూటమికి 300 సీట్లు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. త్వరలో సీమాంధ్రలో నరేంద్ర మోడీ ప్రచారం చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. రాజ్యసభలో తెలంగాణ బిల్లుపై జాప్యం చేస్తే మానవబాంబుతో చంపేస్తామని బెదిరింపులు వచ్చినా తాను భయపడలేదని ఆయన చెప్పారు. సీమాంధ్ర, తెలంగాణ ప్రజల శ్రేయస్సే తనకు ముఖ్యమని, పదవులపై తనకు వ్యామోహం లేదని వెంకయ్య నాయుడు అన్నారు.

  • Loading...

More Telugu News