: వాళ్లిద్దరూ ఎన్నికల ప్రచారానికి కోట్లు కుమ్మరిస్తున్నారు: కేజ్రీవాల్


ప్రచార ప్రకటనలకు నరేంద్ర మోడీ, రాహుల్ గాంధీ వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారని ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ అన్నారు. టెలివిజన్, హోర్డింగులు, దినపత్రికల్లో ఎక్కడ చూసినా వీరిద్దరి ప్రకటనలే కనిపిస్తున్నాయన్నారు. కానీ, తాను సామాన్యుడినని, ప్రచారాన్ని తన సొంత డబ్బులతోనే నిర్వహిస్తున్నానని ఆయన చెప్పుకొచ్చారు. కుటుంబ సభ్యుడిలాంటి తనను ఎన్నుకుంటే అభివృద్ధి చేస్తానని అన్నారు. మోడీ అధికారంలోకి వస్తే లక్షల కోట్లు సంపాదించుకుంటారని కేజ్రీవాల్ ఆరోపించారు.

  • Loading...

More Telugu News