: మన రాష్ట్రంలో ఎన్నికల బరిలో ఉన్న కుబేర నేతలు వీరే


ధనవంతులైన అభ్యర్థులు ఎన్నికల్లో పోటీ చేయడం కొత్త కాదు. అయితే, మరీ సంపన్నులు పోటీ చేయడం, అందులోనూ అది మన రాష్ట్రంలోనే కావడమూ ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఎన్నడూ లేనిది ఈసారి ఎన్నికల్లో ఎక్కువమంది కుబేరులు రాష్ట్రంలో పోటీకి దిగారు. వారిలో ఒకరు గల్లా జయదేవ్. అమెరికాలో చదువుకున్న ఈయన టీడీపీ తరపున గుంటూరు లోక్ సభ స్థానానికి పోటీ చేస్తున్నారు. అతిపెద్ద బ్యాటరీల తయారీ కంపెనీ అమరరాజా బ్యాటరీస్, ఇతర కంపెనీలతో కూడిన అమరరాజా వ్యాపార గ్రూపునకు వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నారు. తనకు, తన కుటుంబ సభ్యుల పేరిట 683 కోట్ల రూపాయల ఆస్తులున్నట్లు ఆయన నామినేషన్ పత్రాల్లో వెల్లడించారు.

ఈయన తర్వాత వైఎస్సార్ కాంగ్రెస్ తరపున నర్సరావుపేట లోక సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న అయోధ్య రామిరెడ్డి ఉన్నారు. ఈయన రామ్ కీ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ అధినేత. తనకు 650 కోట్ల ఆస్తులున్నాయని వెల్లడించారు. టీఆర్ఎస్ తరపున చేవెళ్ల నుంచి పోటీ చేస్తున్న విశ్వేశ్వరరెడ్డి తనకు 528 కోట్ల రూపాయల విలువైన ఆస్తులున్నట్లు ప్రకటించారు. ఇక, వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత, పులివెందుల శాసనసభ స్థానం నుంచి పోటీలో ఉన్న జగన్మోహన్ రెడ్డి 416 కోట్ల రూపాయల ఆస్తులున్నాయని అఫిడవిట్లో పేర్కొన్నారు. హిందూపూర్ శాసనసభ స్థానం నుంచి టీడీపీ తరపున బరిలోకి దిగిన నందమూరి బాలకృష్ణకు నామినేషన్లో పేర్కొన్న ప్రకారం 424 కోట్ల రూపాయల ఆస్తులున్నాయి.

  • Loading...

More Telugu News