: జేపీపై గౌరవముంది... కానీ, ఎన్డీఏ (టీడీపీ) అభ్యర్థికే సపోర్ట్ చేస్తున్నా: పవన్


టీడీపీ అధినేత చంద్రబాబుతో భేటీ అనంతరం జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. హైదరాబాద్ మల్కాజ్ గిరి లోక్ సభ బరిలోకి దిగిన లోక్ సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ అంటే తనకు అంతులేని గౌరవం ఉందని... అందుకే, ఆయనకు మద్దతు పలుకుతున్నట్టు గతంలో తాను ప్రకటించానని చెప్పారు. నిన్న ఎల్బీ స్టేడియంలో జరిగిన సభలో మల్కాజ్ గిరి లోక్ సభ టీడీపీ అభ్యర్థి మల్లారెడ్డిని... సభకు హాజరైన వారికి నరేంద్ర మోడీ పరిచయం చేశారని... అందువల్ల ఎన్డీఏకు మద్దతు పలుకుతున్న తాను... పొత్తుల గౌరవాన్ని పాటిస్తూ, మల్లారెడ్డికి మద్దతు పలుకుతున్నానని చెప్పారు.

  • Loading...

More Telugu News