: పవన్ ఓ గొప్ప యువ నాయకుడు: చంద్రబాబు
దేశం మొత్తం మోడీ నాయకత్వం కోసం ఎదురుచూస్తోందని... బీజేపీ, టీడీపీ పొత్తు రానున్న ఎన్నికల్లో మంచి ఫలితాలను సాధిస్తుందని చెప్పారు. పవన్ కల్యాణ్ తో భేటీ అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. పవన్ మంచి లక్ష్యాలు గల ఓ యువ నాయకుడని... అతనిలాంటి వాళ్లు దేశానికి, రాష్ట్రానికి ఎంతో అవసరమని చెప్పారు. తనది, మోడీది, పవన్ ది ఒకే ఆలోచనా విధానమని తెలిపారు. రెండు రాష్ట్రాల్లోను టీడీపీ, బీజేపీల ప్రభుత్వాలు ఏర్పడతాయని... కేంద్రంలో ఎన్డీయే అధికారంలోకి వస్తుందని చెప్పారు.