: కనిపించకుండా పోయిన భార్య... శవమై ‘ఫేస్ బుక్’లో కనిపించింది!


కొన్ని రోజులుగా అతని భార్య జాడ తెలియలేదు... వెతికినా ఫలితం లేకుండా పోయింది. చివరకు ఫేస్ బుక్ లో భార్య శవం కనిపించటంతో అతను గుర్తుపట్టి పోలీసులకు తెలిపాడు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ లోని మీరట్ లో జరిగింది. మీరట్ లో వారం రోజుల క్రితం అక్కడి జింఖానా సమీపంలో ఆ యువతి శవాన్ని పోలీసులు గుర్తించారు. ఆగంతుకులు ఆమెను అత్యంత సమీపం నుంచి కాల్చి చంపారు. అయితే, ఘటనా స్థలంలో ఆ యువతికి సంబంధించిన ఏ ఒక్క ఆధారమూ వారికి దొరకలేదు.

యూపీ పోలీసులు ఆమె మృతదేహాన్ని ఫోటో తీసి, ఫేస్ బుక్ లో పెట్టారు. ఆ ఫోటోను ఫేస్ బుక్ యూజర్లు చాలా మంది షేర్ చేశారు. చిట్టచివరకు ఆ ఫోటో ఆమె భర్త విపిన్ కంటబడింది. నోయిడాకు చెందిన తన భార్య నేహ ఫొటో గురించి అతడు పోలీసులకు సమాచారం అందించారు. నేహ కొన్నాళ్లుగా కనిపించకుండా పోయిందని, ఆమె కోసం తాను చాలా చోట్ల గాలించానని, చివరకు ఆమె మృతదేహం ఫేస్ బుక్ లో కనిపించిందని విపిన్ కన్నీరుమున్నీరయ్యాడు. అయితే, అసలు నేహ నోయిడా నుంచి మీరట్ కు ఎందుకు వెళ్లింది? అక్కడ ఎలా హత్యకు గురైంది? లాంటి ప్రశ్నలకు మాత్రం ఇంకా సమాధానం దొరకలేదు.

  • Loading...

More Telugu News