: జమ్మూ కాశ్మీర్లో 25మంది సర్పంచ్ ల రాజీనామా
దాడుల భయంతో జమ్మూ కాశ్మీర్లో 25 మంది సర్పంచ్ లు తమ పదవులకు రాజీనామా చేశారు. ఇటీవల పలువురు సర్పంచ్ లపై మిలిటెంట్లు దాడులకు పాల్పడిన నేపథ్యంలో వారీ నిర్ణయం తీసుకున్నారు. అనంతనాగ్ లోక్ సభ నియోజకవర్గానికి గురువారం పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో మిలిటెంట్లు దాడులను తీవ్రతరం చేశారు. ప్రజలు ఓటింగ్ లో పాల్గొనకుండా అడ్డుకునేందుకే వారు ఈ దాడులు చేస్తున్నారంటూ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా వ్యాఖ్యానించారు. దాడుల నేపథ్యంలో పోలీసులు భద్రతను పెంచారు.