: వారణాసిలో నేడు కేజ్రీవాల్ నామినేషన్
ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ నేడు వారణాసి లోక్ సభ స్థానంలో నామినేషన్ వేయనున్నారు. ఓపెన్ టాప్ జీప్ లో బయల్దేరి దారి పొడవునా అభిమానులను, మద్దతుదారులను కలుస్తూ వెళ్లి మధ్యాహ్నం 12.30గంటలకు నామినేషన్ దాఖలు చేస్తారు. బీజేపీ ప్రధాని అభ్యర్థి మోడీని ఓడించాలన్నది ఆయన స్వప్నం.
ఇది నెరవేరేందుకు వీలుగా కేజ్రీవాల్ కు సహకరించడానికి ఖ్వామిఏక్తాదళ్ పార్టీ ముందుకు వచ్చింది. మాఫియాడాన్ నుంచి నేతగా మారిన ముక్తార్ అన్సారీ స్థాపించిందే ఈ పార్టీ. తొలుత ఈయన కూడా మోడీపై పోటీ చేయాలనుకున్నారు. కానీ, ఓట్లు చీలిక రాకూడదనే ఉద్దేశంతో పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఇప్పుడు మోడీని ఓడించేందుకు కేజ్రీవాల్ కు మద్దుతిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. అయితే, దీనిపై ఈ నెల 29న కార్యకర్తలతో మాట్లాడిన తర్వాత ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకుంటామని అన్సారీ సోదరుడు అఫ్జల్ అన్సారీ చెప్పారు.