: ఢిల్లీ అత్యాచార నిందితుడి బెయిల్ పై నేడు విచారణ
ఢిల్లీ అత్యాచార ఘటన నిందితుల్లో ఒకరైన వినయ్ శర్మ బెయిల్ పై ఈరోజు న్యూఢిల్లీలోని ఫాస్ట్ ట్రాక్ కోర్టు విచారణ జరుపుతోంది. 'ఇండియన్ ఎయిర్ ఫోర్సు' ఇంటర్వ్యూలో భాగంగా పరీక్షకు సిద్ధమయ్యేందుకు నిందితుడు శర్మకు బెయిల్ ఇవ్వాలంటూ అతని న్యాయవాది కొన్ని రోజుల కిందట కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశాడు. ఈనెల 5వ తేదీన తన క్లయింటు ఇంటర్వ్యూకు హాజరుకావలసి ఉందని అందులో తెలిపాడు.