: మల్కాజ్ గిరి నుంచే మార్పునకు నాంది పలకాలి: జేపీ
దేశంలో మార్పు రావాలని, ఆ మార్పు మల్కాజ్ గిరి లోక్ సభ నియోజకవర్గం నుంచే ఉప్పెనలా మొదలు కావాలని లోక్ సత్తా జాతీయ కన్వీనర్ జయప్రకాశ్ నారాయణ్ అన్నారు. మల్కాజ్ గిరి స్థానంలో పోటీ చేస్తున్న ఆయన ఈ రోజు నియోజకవర్గం పరిధిలోని పలు ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించారు. తాను అధికారం కోసం రాజకీయాల్లోకి రాలేదని, అవినీతిని నిర్మూలించడానికే వచ్చినట్లు చెప్పారు. మోడీతోనే దేశాభివృద్ధి సాధ్యమన్నారు. ఏటా కోటిన్నర మంది చదువుకుని బయటకు వస్తుంటే, 20లక్షల మందికి లోపే ఉద్యోగాలు లభిస్తున్నాయని, అందరికీ ఉద్యోగావకాశాలు కల్పించాల్సిన అవసరముందని ఆయన నొక్కి చెప్పారు. అభివృద్ధి కోసం లోక్ సత్తా అభ్యర్థులను గెలిపించాలని కోరారు.