: ముంపు మండలాలపై జైరాం రమేష్ కొత్త ట్విస్ట్


పోలవరం ముంపు మండలాలపై కేంద్ర మంత్రి జైరాం రమేష్ సరికొత్త ట్విస్ట్ ను తెరమీదకు తీసుకొచ్చారు. ఇప్పటిదాకా ముంపు మండలాలు సీమాంధ్రలో భాగమని చెప్పిన జైరాం ఇప్పుడు సరికొత్త పల్లవి అందుకున్నారు. ముంపు ప్రాంతాలను సీమాంధ్రలో కలిపేలా బిల్లును తయారుచేశామని... ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున దీనికి సంబంధించిన ఆర్డినెన్స్ పై రాష్ట్రపతి సంతకం చేయలేదని చెప్పారు. ఎన్నికల తర్వాత ఏర్పడే కేంద్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు ముంపు మండలాలపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని తెలిపారు.

  • Loading...

More Telugu News