: వీఐపీలకు అంత భద్రతా.. మహిళలకు ఏది?: సుప్రీంకోర్టు


'వీఐపీల భద్రత కోసం పోలీసులను నియమిస్తున్నారు, మరి మహిళకు ఎందుకు రక్షణ కల్పించడం లేదు?' అని సుప్రీం కోర్టు ఢిల్లీ ప్రభుత్వాన్నినిలదీసింది. వీఐపీల భద్రతకు వినియోగించే పోలీసుల్లో ఎక్కువ మందిని ఢిల్లీ వీధుల్లో మహిళల రక్షణ కోసం నియమించవచ్చుగా? అని ప్రశ్నించింది. ప్రముఖుల భద్రత కోసం వేల కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నారని, ఈ నిధులతో మహిళలకు రక్షణ కల్పించవచ్చంటూ న్యాయవాది హరీష్ సాల్వే దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు ఈ రోజు విచారించింది.

వీఐపీల భద్రత కోసం వినియోగిస్తున్న పోలీసుల విషయమై పూర్తి సమాచారంతో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఈ నెల 11 లోపు అఫిడవిట్ దాఖలు చేయాలని కోర్టు ఆదేశించింది. అఫిడవిట్లు దాఖలు చేయకుంటే అన్ని రాష్ట్రాల హోం శాఖ కార్యదర్శులు ఈ నెల 16న వ్యక్తిగతంగా కోర్టుకు హాజరు కావాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.

  • Loading...

More Telugu News