: కాంగ్రెస్ పార్టీ ఖాతా కూడా తెరవకూడదు: మోడీ


సీమాంధ్ర, తెలంగాణల్లో కాంగ్రెస్ పార్టీ ఖాతా కూడా తెరవకుండా చూడాలని బీజేపీ ప్రధాని అభ్యర్థి మోడీ ఓటర్లను కోరారు. వచ్చే ఐదేళ్ల పాలనపైనే దేశంలోని యువత భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని చెప్పారు. 18 నుంచి 28 ఏళ్ల వయసున్న యువత వల్లే ఏదైనా సాధ్యమవుతుందని... ఈ ఎన్నికల్లో యువత సత్తా చాటాలని పిలుపునిచ్చారు. యువత కల నెరవేరాలంటే ఢిల్లీలో పనిచేసే ప్రభుత్వం రావాలని చెప్పారు. అందువల్ల, ఆలోచించి ఓటువేయాలని యువతను మోడీ కోరారు. పిల్లల కోసం ఎన్నో జాగ్రత్తలు తీసుకునే మనం... కేంద్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే విషయంలో మరింత జాగ్రత్త తీసుకోవాలని సూచించారు.

  • Loading...

More Telugu News