: మోడీ, చంద్రబాబు, పవన్ కెమిస్ట్రీ అద్భుతంగా కలిసింది: మోడీ
లెక్కల్లో ఒకటి, ఒకటి, ఒకటి కలిస్తే 3 అవుతుందని... కానీ ఇక్కడ ఒకటి, ఒకటి, ఒకటి కలిస్తే 111 అవుతుందని బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ చెప్పారు. ఈ ఎన్నికలంటే లెక్కలు కాదని... బంధాలు, అనుబంధాలు అని తెలిపారు. మోడీ, చంద్రబాబు, పవన్ కెమిస్ట్రీ అద్భుతంగా కలిసిందని కితాబిచ్చుకున్నారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ప్రసంగిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈసారి జరుగుతున్న ఎన్నికలు ఎంతో ప్రత్యేకమైనవని ఆయన తెలిపారు. కాంగ్రెస్ పార్టీ కాని, దాని మిత్రపక్షాలు కాని గెలిచే పరిస్థితి లేదని చెప్పారు. కొంతమంది రాజకీయ విశ్లేషకుల అంచనాలు తప్పుతాయని... వారంతా ఏసీ గదుల్లో కూర్చొని ప్రజల నాడిని అంచనా వేస్తున్నారని దుయ్యబట్టారు. విశ్లేషకుల అంచనాలకు విరుద్ధంగా ఫలితాలు వస్తాయని చెప్పారు.