: మోడీది- నాది 'విన్ విన్' కాంబినేషన్: చంద్రబాబు


ప్రజల ఉత్సాహం చూస్తుంటే మోడీ ప్రధాని కావడం ఖాయమనే విషయం అర్థమవుతోందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. తనది, మోడీది విన్ విన్ కాంబినేషన్ అని... కేంద్రంలో ఎన్డీఏ, రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వస్తాయని జోస్యం చెప్పారు. రైతులు బాగుపడాలంటే ఎన్డీఏ ప్రభుత్వం రావాలని తెలిపారు. ఎన్డీఏ, టీడీపీ ప్రభుత్వాలు ఉన్నప్పుడే హైదరాబాద్ ఆదాయం పెరిగిందని గుర్తుచేశారు. తెలంగాణలో కేసీఆర్ కుటుంబం బాగుపడింది కాని, ఈ ప్రాంతానికి ఒరిగిందేమీ లేదని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. మన్మోహన్ అసమర్థ ప్రధాని అయితే... రాహుల్ గాంధీ అవగాహన లేని నాయకుడని ఎద్దేవా చేశారు. దేశం నుంచి కాంగ్రెస్ ను తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు.

  • Loading...

More Telugu News