: తెలంగాణ వ్యతిరేకి పవన్ కల్యాణ్: నాయని


టీఆర్ఎస్ పార్టీ, ఆ పార్టీ అధినేతపై ఘాటైన వ్యాఖ్యలు చేస్తున్న జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పై టీఆర్ఎస్ ఎదురు దాడికి దిగింది. పవన్ కల్యాణ్ పచ్చి తెలంగాణ వ్యతిరేకి అని టీఆర్ఎస్ నేత నాయని నర్శింహారెడ్డి ఆరోపించారు. పవన్ కల్యాణ్ పార్టీకి ఓ విధానం లేదు, ఓ కమిటీ లేదని విమర్శించారు. పవన్ కల్యాణ్ రాజకీయాలకు ఏమాత్రం పనికిరాడని అన్నారు. సెటిలర్లకు టీఆర్ఎస్ వ్యతిరేకం కాదని నాయని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ కి కేసీఆర్ ని విమర్శించే హక్కు లేదని అన్నారు. 1500 మంది చావులకు కారణమైన సోనియా, రాహుల్ లపై మర్డర్ కేసులు పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News