: మహబూబ్ నగర్ లో రాహుల్ అబద్దాలు చెప్పారు: కిషన్ రెడ్డి
తెలంగాణ ఏర్పాటును బీజేపీ అడ్డుకుందని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ నిన్న మహబూబ్ నగర్ లో జరిగిన సభలో అబద్ధాలు చెప్పారని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణ కోసం మొదటి నుంచి అనుకూలంగా ఉన్నది బీజేపీనే అని తెలిపారు. కాంగ్రెస్ పాలనలో అన్నీ సమస్యలేనని... ఎన్డీయే అధికారంలోకి వస్తే పేదలకు మేలు జరుగుతుందని చెప్పారు. ప్రస్తుతం దేశం మొత్తం మోడీవైపు చూస్తోందని... 'కాంగ్రెస్ ముక్త్ భారత్' కోసం మోడీ పిలుపునిచ్చారని... కాంగ్రెస్ ను తరిమికొడదామని పిలుపునిచ్చారు. నిజామాబాద్ లో జరిగిన బీజేపీ సభలో కిషన్ రెడ్డి ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.