: తెలంగాణకు ఈ ఎన్నికలు అత్యంత కీలకం: మోడీ
నిజామాబాద్ లో జరగుతున్న బీజేపీ భారీ బహిరంగ సభలో నరేంద్ర మోడీ ప్రసంగం మొదలైంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ ఎన్నికలు తెలంగాణకు అత్యంత కీలకమని చెప్పారు. అన్ని ఎన్నికల మాదిరిగా ఈ ఎన్నికలను చూడవద్దని ప్రజలను కోరారు. ఎవరి దయాదాక్షిణ్యాల వల్లో తెలంగాణ రాలేదని, ఎందరో బలిదానాల వల్లే తెలంగాణ వచ్చిందన్నారు. కొత్త రాష్ట్రానికి మంచి ప్రభుత్వం రావాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణను ఎవరి చేతుల్లోనో పెడితే ఏమవుతుందో అని ఆందోళనగా ఉందన్నారు. కానీ, తాము (బీజేపీ) అధికారంలోకి వచ్చాక తెలంగాణ భాగ్యరేఖను మారుస్తామని ఆయన హామీ ఇచ్చారు.