: సోనియావల్లే మన్మోహన్ కు చెడ్డపేరు: జనసేన అధినేత
ప్రధానమంత్రి పదవిలో ఉన్న మన్మోహన్ సింగ్ కు తెరవెనుక నుంచి నడిపిస్తున్న కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ వల్లే చెడ్డపేరు వచ్చిందని పవన్ విమర్శించారు. నడిచేది మన్మోహన్.. నడిపించేది సోనియా అని ఆరోపించారు. సోనియా నిర్వాకం వల్లే తెలంగాణ పోరాటంలో పలువురు యువకులు ఆత్మ బలిదానాలు చేసుకున్నారన్నారు. కానీ, ఈ విషయాన్ని అందరూ విమర్శిస్తుంటే, కాంగ్రెస్ నాయకులు మాత్రం ఖండిస్తారని పవన్ చెప్పారు. ఈసారి ఓటేయాలని అడిగేందుకు కాంగ్రెస్ నేతలు వస్తే బీజేపీకి ఓటు వేస్తున్నామని చెప్పండని సభకు భారీగా తరలివచ్చిన బీజేపీ, టీడీపీ శ్రేణులకు సూచించారు.