: మాటల చిచ్చు రాజేసిన మరో నేత
శివసేన నేత రామ్ దాస్ కదం ముస్లింలను లక్ష్యంగా చేసుకుని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 2011 ఆగస్టులో ముంబైలోని ఆజాద్ మైదాన్ వద్ద అల్లర్లకు పాల్పడిన ముస్లింలను వదిలిపెట్టబోమని హెచ్చరించారు. పోలీసు వాహనాలను దహనం చేసిన, ప్రజా ఆస్తులను ధ్వంసం చేసిన, మహిళా పోలీసులపై దాడి చేసిన ముస్లింలను వదిలేది లేదన్నారు. మోడీ ప్రధాని అయిన ఆరు నెలల్లోగా భారత సైనికులపై దాడికి పాల్పడ్డ పాకిస్థాన్ పై ప్రతీకారం తీర్చుకుంటారని వ్యాఖ్యానించారు.