: చుండూరు కేసులో శిక్ష రద్దుపై సుప్రీంకు వెళతాం: కత్తి పద్మారావు
గుంటూరు జిల్లా చుండూరులో 1991లో జరిగిన దళితుల ఊచకోత కేసులో నిందితుల జీవిత ఖైదును హైకోర్టు రద్దు చేయడాన్ని దళితవాద ఉద్యమకారుడు కత్తి పద్మారావు ఖండించారు. ఈ కేసులో కోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళతామని చెప్పారు. నిందితులకు శిక్ష పడేంత వరకూ పోరాడుతూనే ఉంటామన్నారు.