: పవన్, రాంచరణ్, మహేష్ బాబులను అధిగమించిన అల్లు అర్జున్
రేసుగుర్రం హిట్ తో మాంచి జోష్ మీదున్న అల్లు అర్జున్ మరో రికార్డు సొంత చేసుకున్నాడు. సోషల్ నెట్వర్కింగ్ సైట్ ఫేస్ బుక్ లో అల్లు అర్జున్ ను ఫాలో అవుతున్న వారి సంఖ్య అమాంతం పెరిగింది. తాజాగా ఎఫ్ బీ లో 40 లక్షల లైక్ లతో అల్లు అర్జున్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఈ క్రమంలో టాలీవుడ్ సూపర్ స్టార్లైన పవన్ కల్యాణ్, మహేష్ బాబు, రాం చరణ్, ప్రభాస్ లను అల్లు అర్జున్ వెనక్కి నెట్టాడు. ప్రస్తుతం సినీనటులంతా సోషల్ మీడియా ద్వారా అభిమానులతో అనుసంధానమౌతున్న సంగతి తెలిసిందే.