: ఆదిత్యచోప్రాను పెళ్లాడిన రాణీముఖర్జీ
చాలాకాలంగా డేటింగ్ లో ఉన్న నిర్మాత, దర్శకుడు ఆదిత్య చోప్రా, నటి రాణీముఖర్జీ పెళ్లి పీటలు ఎక్కారు. ఇటలీలో నిన్న రాత్రి వీరి వివాహం కేవలం కొద్ది మంది అతిధుల సమక్షంలో జరిగింది. ఈ విషయాన్ని సినీరంగానికి చెందిన అనలిస్ట్ తరాన్ ఆదర్శ్ ట్విట్టర్లో వెల్లడించారు. చోప్రాతో పెళ్లి వార్తలను రాణీముఖర్జీ లోగడ కొట్టివేయడం తెలిసిందే. వీరు చాలా కాలంగా డేటింగ్ చేస్తూ, పెళ్లిని తోసిపుచ్చుతూ వస్తుండడంతో వీరి అనుబంధంపై వదంతులు నెలకొన్నాయి. చివరికి ఈ జంట పెళ్లి ద్వారా వాటికి తెరదించింది.