: చిక్కుల్లో కేజ్రీవాల్!


ఆమ్ ఆద్మీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ చిక్కుల్లో పడ్డారు. ప్రత్యర్థి పార్టీలు ఇచ్చే డబ్బులు తీసుకుని, ఓటు మాత్రం ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థికే వేయాలని ఉత్తరప్రదేశ్ లోని అమేథీ నియోజకవర్గంలో జరిగిన ప్రచారంలో ఓటర్లకు పిలుపునిచ్చారు. వారు 2జీ, కామన్వెల్త్ తదితర స్కాముల్లో దోచుకున్నారని, ఓటుకు డబ్బులిస్తే తీసుకోవాలని, దుప్పట్లు, చీరలు ఇచ్చినా తీసుకుని ఓటు మాత్రం చీపురు గుర్తుకే వేయాలని ఆయన కోరారు. ఈ వ్యాఖ్యలు ఎన్నికల నియమావళికి వ్యతిరేకం కావడంతో కేజ్రీవాల్ కు ఎన్నికల సంఘం నుంచి శ్రీముఖం వచ్చే అవకాశం ఉంది.

  • Loading...

More Telugu News