: పీజీ మెడికల్ స్కాంలో మరో పది మంది అరెస్టు


ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పీజీ ప్రవేశ అర్హత పరీక్షలో సీఐడీ పోలీసుల దర్యాప్తు చకచకా జరుగుతోంది. తాజాగా ఈ కేసులో మరో పది మందిని అదుపులోకి తీసుకున్నారు. వారిలో గుంటూరుకు చెందిన ముగ్గురు బ్రోకర్లు సహా ఇద్దరు యువకులు, ఐదుగురు యువతులు ఉన్నారని పోలీసులు తెలిపారు. హైదరాబాదు, గోవాలోని హోటల్స్ లో విద్యార్థులకు బ్రోకర్లు కోచింగ్ ఇప్పించారని తెలుస్తోంది. కాగా, ఇప్పటికే ఈ స్కాంలో ముప్పై మందిని అరెస్టు చేసి కోర్టు ముందు ప్రవేశపెట్టడంతో రిమాండు విధించారు. ప్రస్తుతం వారంతా విజయవాడ జైల్లో ఉన్నారు.

  • Loading...

More Telugu News