: పురందేశ్వరి, హరికృష్ణ, జూ.ఎన్టీఆర్ లపై బాలకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు
ఈ రోజు శ్రీకాకుళంలో టీడీపీ శ్రేణులతో ఆ పార్టీ నేత నందమూరి బాలకృష్ణ ముచ్చటిస్తూ పురందేశ్వరి, జూ.ఎన్టీఆర్ లపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టీడీపీ, బీజేపీల మధ్య పొత్తు ఉన్నప్పటికీ... తన సోదరి పురందేశ్వరి తరపున ప్రచారం చేసే అంశం తన ప్రణాళికలో లేదని తెలిపారు. అలాగే జూనియర్ ఎన్టీఆర్ పై పరోక్షంగా వ్యాఖ్యానిస్తూ, పార్టీ కోసం ప్రచారం చేయాలంటూ టీడీపీ ఎవరినీ బొట్టు పెట్టి పిలవదని... ఎవరి ఇష్ట ప్రకారం వారు ప్రచారం చేయవచ్చని అన్నారు. అయితే, తన సోదరుడు హరికృష్ణకు మాత్రం పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని తెలిపారు. పార్టీ కోసం కష్టపడేవారికి ఎల్లప్పుడూ గుర్తింపు ఉంటుందని చెప్పారు.