: బ్రదర్ అనిల్ కోసం కేఏ పాల్ కు వైఎస్ అన్యాయం చేశారు: యనమల
తన అల్లుడు బ్రదర్ అనిల్ కుమార్ కోసం క్రైస్తవ మతబోధకుడు కేఏ పాల్ కు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి తీరని అన్యాయం చేశారని టీడీపీ నేత యనమల రామకృష్ణుడు ఆరోపించారు. వైఎస్సార్సీపీ అధినేత జగన్ పై 20కి పైగా కేసులున్నాయని... ఇన్ని కేసులను అఫిడవిట్ లో పేర్కొన్న ఏకైక వ్యక్తి జగన్ మాత్రమే అని విమర్శించారు. అయితే, అఫిడవిట్ లో తనకు ఒక కారు కూడా లేదని జగన్ పేర్కొన్నారని... ఆయన తిరిగే బిఎండబ్ల్యూ కార్లు ఎవరివని ప్రశ్నించారు. ఆయన వాడే బీఎండబ్ల్యూ, స్కార్పియో కార్లను కాకులెత్తుకెళ్లాయా? అంటూ ఎద్దేవా చేశారు. తండ్రి చనిపోయాడనే బాధ కూడా లేకుండా... ముఖ్యమంత్రి పదవికోసం రాయబారాలు నడిపిన ఘనత జగన్ ది అని ధ్వజమెత్తారు.