: సీబీఐ కోర్టులో హాజరైన మంత్రి ధర్మాన


వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్ మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో మంత్రి ధర్మాన ప్రసాదరావు ఈ ఉదయం హైదరాబాద్ నాంపల్లి సీబీఐ కోర్టులో హాజరయ్యారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ హయాంలో జగన్ కు అనుకూలంగా భూములు కేటాయిస్తూ ధర్మాన జీవోలు జారీ చేశారన్న ఆరోపణలపై గతంలో సీబీఐ ఆయనకు నోటీసులు జారీ చేసింది. ఇదే కేసులో ఐఏఎస్ లు శామ్యూల్, మన్మోహన్ సింగ్ పారిశ్రామిక వేత్తలు నిత్యానంద రెడ్డి, అయోధ్య రామిరెడ్డి, శ్రీనివాసరెడ్డి హాజరయ్యారు. మరోవైపు ఎమ్మార్ కేసులో కోర్టుకు బీపీ ఆచార్య, శ్రవణ్ గుప్తా, కోనేరు ప్రసాద్, కోనేరు మధు వచ్చారు. 

  • Loading...

More Telugu News