: ఫేస్ బుక్ వాడితే ఇక యూజర్లకు డబ్బులే డబ్బులు?


మీకు ఫేస్ బుక్ ఉందా? లేకుంటే లక్కీ చాన్స్ మిస్ అయినట్లే. ఇకపై ఫేస్ బుక్ తన యూజర్లకు సొమ్ములు చెల్లించనుంది. ఫేస్ బుక్ లో ప్రతిరోజూ మీరు పోస్టులు, కామెంట్లతో సందడి చేస్తుంటే చాలు. ఆ లక్కీ చాన్స్ మీకే రావచ్చు. ఫేస్ బుక్ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు కానీ, దీనికి సంబంధించిన ప్రయోగాలు జరుగుతున్నాయని సమాచారం లీక్ అయింది. 

ఫేస్ బుక్ ఇలా తన యూజర్లందరికీ నగదు ప్రయోజనాలు అందించదు. కేవలం చాలా యాక్టివ్ గా ఉన్న సభ్యుల నుంచి కొంత మందిని ఎంపిక చేసి, ఫేస్ బుక్ లో వారి ప్రతీ యాక్టివిటీకి కొంత నగదు చెల్లిస్తుంది. ఫేస్ బుక్ లో యాక్టివిటీ పరంగా టాప్ పొజిషన్ లో ఉన్న 4 శాతం మందికి చెల్లించవచ్చని సమాచారం. ఫ్రెండ్స్, ఫాలోవర్స్ తో సంబంధం లేకుండా యాక్టివిటీ ఎక్కువగా ఉన్న వారికి ఈ ప్రయోజనం అందించాలని ఫేస్ బుక్ యోచనగా తెలుస్తోంది. 

దీనిని ఇప్పటికే న్యూజిలాండ్ లో కొంతమందిపై ప్రయోగాత్మకంగా పరీక్షిస్తోందని సమాచారం. ఒక్కో యాక్టివిటీకి ఒక డాలర్ చెల్లించవచ్చని అంటున్నారు. పోటీ మార్కెట్ లో కీలకమైన యూజర్లను కోల్పోకూడదని.. మరింత మందిని ఫేస్ బుక్ వైపు నడిపించాలని, సోషల్ మీడియాలో తన అగ్ర స్థానాన్ని కాపాడుకోవాలనే ఫేస్ బుక్ ఈ సంచలన ఆలోచనకు తెరలేపిందని భావిస్తున్నారు. 

  • Loading...

More Telugu News