: నా ఆస్తులపై విచారణకు సిద్ధం: కేసీఆర్
ఆస్తులు ప్రకటించే దమ్ము కేసీఆర్ కు ఉందా? అని ప్రశ్నించిన తెలంగాణ కాంగ్రెస్ నేతల మాటలకు కరీంనగర్ జిల్లా ఎన్నికల పర్యటనలో కేసీఆర్ సమాధానమిచ్చారు. తన ఆస్తులపై విచారణకు సిద్ధమని తెలిపారు. ఇక టీఆర్ఎస్ గురించి మాట్లాడే హక్కు కాంగ్రెస్ నేతలకు లేదని మండిపడ్డారు. ఈ మేరకు ఆయన కోరుట్లలో మాట్లాడుతూ.. కాంగ్రెస్ నేతలు నోరు అదుపులో పెట్టుకుంటే మంచిదన్నారు.