: కేసీఆర్ అభినవ శిశుపాలుడు: పొన్నాల
టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అభినవ శిశుపాలుడని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య అభివర్ణించారు. అబద్ధాలాడటం ఆయనకు కొత్తేం కాదని, అలవాటుగా వచ్చిందేనని అన్నారు. సోనియా ఎన్నో కష్టాల కోర్చి తెలంగాణ ఇస్తే తిరిగి ఆమెనే ఈయన విమర్శిస్తున్నారన్నారు. పూటకో మాట మార్చే కేసీఆర్ కు ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు. టీఆర్ఎస్ ను విలీనం చేయమని కేసీఆర్ ను ఎవరూ కోరలేదని, అప్పట్లో ఆయనే విలీనం చేస్తానని ప్రకటించారని పొన్నాల చెప్పారు.