: జపాన్ కు పయనమైన చిదంబరం
కేంద్ర ఆర్ధిక మంత్రి చిదంబరం నేడు జపాన్ పర్యటనకు బయలుదేరి వెళుతున్నారు. విదేశీ పెట్టుబడిదారులను ఆకర్షించేందుకు ప్రభుత్వం తరపున ఈ పర్యటన చేపట్టారు. మూడు రోజులపాటు సాగే ఈ పర్యటనలో జపాన్ ఆర్ధిక మంత్రితో బాటు పలువురిని చిదంబరం కలవనున్నారు. ఇప్పటికే సింగపూర్, యూరప్ లలో పర్యటించిన ఆయన, పెట్టుబడిదారులకు భారత్ చేపడుతున్న సంస్కరణలను వెల్లడించారు.