: రాష్ట్ర విభజనలో చంద్రబాబు కూడా భాగస్వామే: జగన్
ప్రకాశం జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ ఎన్నికల ప్రచారం కొనసాగుతోంది. కందుకూరులో ఇవాళ ఆయన రోడ్ షోలో పాల్గొని ప్రసంగించారు. జగన్ టీడీపీ అధినేత చంద్రబాబుపై విమర్శల వర్షం కురిపించారు. టీడీపీ ఎంపీలు విభజనకు అనుకూలంగా ఓటు వేశారని, రాష్ట్ర విభజనలో చంద్రబాబు కూడా భాగస్వామేనని ఆయన ఆరోపించారు. చంద్రబాబు నాయుడికి విశ్వసనీయత అంటే అర్థం తెలీదని జగన్ అన్నారు. తొమ్మిదేళ్ల పాలనలో చంద్రబాబు ప్రజలకు చేసిందేమీ లేదని అన్నారు. ఇప్పుడు అధికారం కోసం చంద్రబాబు అన్నీ ‘ఫ్రీ’గా ఇస్తానని చెబుతున్నారని, అయినా ‘ఆల్ ఫ్రీ’ బాబు అధికారంలోకి రావడం కల్ల అని జగన్ చెప్పారు.