: ఆ అవినీతి పార్టీలను తరిమికొట్టండి: కేశినేని నాని
అవినీతి పార్టీలైన కాంగ్రెస్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలను తరిమికొట్టాలని విజయవాడ పార్లమెంటు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి కేశినేని నాని ప్రజలకు పిలుపునిచ్చారు. ఇవాళ ఉదయం విజయవాడ పశ్చిమ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ తో కలిసి భవానీపురంలో నాని ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కేంద్రంలో మోడీ ప్రధాని, రాష్ట్రంలో చంద్రబాబు ముఖ్యమంత్రి కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కేంద్రం, రాష్ట్రాల్లో కాంగ్రెస్ నిర్వాకంతో ప్రజలు విసిగిపోయారని ఆయన అన్నారు.