: రైల్వే ఛార్జీల బాదుడు నేటి నుంచే


ఓ పక్క విద్యుత్, భూముల రిజస్ట్రేషన్ ఛార్జీల పెంపు నేటి నుంచే అమల్లోకి వస్తుంటే...  మరోపక్క వీటికి రైలు ఛార్జీల పెంపు కూడా తోడయింది. ఒక్కసారే మూడు రకాల ఛార్జీలను ఏప్రిల్ మొదటి నుంచే ఇటు రాష్ట్రం, అటు కేంద్రం అమలు చేయడం ప్రజలకు పెద్ద షాకే. ఈ నేపథ్యంలో 2013-14 రైల్వే బడ్జెట్ లో పెంచిన టికెట్ ధరలు, ఇతర ఛార్జీలు నేటి నుంచి అమలులోకి వస్తున్నాయి.

బడ్జెట్ లో ప్రకటించిన ప్రకారం.. సూపర్ ఫాస్ట్, తత్కాల్ ఛార్జీలు, రిజర్వేషన్ రద్దు రుసుము పెరుగుతాయి. ఇందులో ఏసీ తరగతులకు టికెట్ పై రూ.15 నుంచి రూ.25 వరకు రిజర్వేషన్ రుసుము పెరుగుతుంది. సూపర్ ఫాస్ట్ ఛార్జీలు, రెండో తరగతికి రూ.10 మేర పెరుగుతున్నాయి. ఇక ఏసీ తరగతులకు మాత్రం ఈ పెంపు రూ.15 నుంచి రూ.25 వరకు దాకా ఉంటుంది.

  • Loading...

More Telugu News