: పెళ్లి మండపంలో అవయవదానాల రికార్డు
ప్రేమించుకున్నారు. పెద్దల ఆమోదంతో పెళ్లి చేసుకున్నారు. పెళ్లి వేదికపైనే పది మందికి స్ఫూర్తి కలిగించే నిర్ణయాన్ని ప్రకటించారు. మరణానంతరం తమ అవయవాలను వేరొకరికి దానం చేయడానికి అంగీకరించారు. విజయనగరం జిల్లా చీపురుపల్లి సమీపంలోని వంగవల్లిపేటలో ఇది జరిగింది. గ్రామంలో శనివారం అర్ధరాత్రి అప్పారావు, పైడితల్లి వివాహం జరిగింది. నూతన దంపతులు అవయవదానం చేయడానికి తీసుకున్న నిర్ణయం పెళ్లికి వచ్చిన వారిని కూడా ఆలోచింపజేసింది. దాంతో తాము కూడా మరణానంతరం నేత్రదానం చేస్తామని అక్కడున్న వారిలో 13 మంది ప్రకటించారు.