: 'తెహల్కా' ఎడిటర్ కు బెయిల్ నిరాకరణ
'తెహల్కా' పత్రిక సంపాదకుడు తరుణ్ తేజ్ పాల్ కు మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ మేరకు ఆయన దాఖలు చేసుకున్న పిటిషన్ ను కోర్టు కొట్టివేసింది. మరోవైపు ఈ కేసులో గోవా ప్రభుత్వానికి సుప్రీం నోటీసు జారీ చేసింది. తేజ్ పాల్ కు బెయిల్ ఎందుకు ఇవ్వకూడదో నాలుగు వారాల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. అత్యాచార యత్నం కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న తేజ్ పాల్ గతేడాది చివరి నుంచి గోవా జైల్లో రిమాండులో ఉన్న విషయం విదితమే.