: కులాంతర వివాహాలకు అనుమతించిన ఖాప్ పంచాయతీ
హర్యానాలో కులాంతర వివాహాలు చేసుకుంటే వారిని అంతమొందించడం సహా పలు సంచలన తీర్పులకు ఖాప్ పంచాయతీలు పెట్టింది పేరు. అయితే, కులాంతర వివాహాలకు అనుమతిస్తూ తాజాగా హిస్సార్ లోని శాట్రాల్ ఖాప్ పంచాయతీ సంచలన నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి ఇప్పటి వరకు వేర్వేరు కులాల వారు, వేర్వేరు గ్రామస్థులు, ఒకే గోత్రం గలవారు వివాహం చేసుకుంటే దాన్ని ఖాప్ పంచాయతీలు నేరంగా పరిగణిస్తున్నాయి. కానీ, శాట్రాల్ ఖాప్ పంచాయతీ మాత్రం కులాంతర వివాహాలతో పాటు, చుట్టూ 42 కిలోమీటర్ల పరిధిలోని ఏ గ్రామానికి చెందిన వారినైనా వివాహం చేసుకునేందుకు అనుమతిస్తూ నిర్ణయం తీసుకుంది.