: ఇక నోకియా అంతర్థానమే!


ఎంతో చరిత్ర కలిగిన నోకియా మొబైల్ అంతర్థానం అయ్యే రోజు దగ్గర్లోనే ఉంది. ఫిన్లాండ్ కు చెందిన నోకియా కార్పొరేషన్ మొబైల్ వ్యాపారాన్ని మైక్రోసాఫ్ట్ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఈ డీల్ ఏప్రిల్ లోపు పూర్తి కానున్నట్లు నోకియా స్వదేశంలోని తన డీలర్లకు సమాచారం అందించింది. అంతేకాదు, ఈ డీల్ పూర్తయితే నోకియా కార్పొరేషన్ పేరు మైక్రోసాఫ్ట్ మొబైల్ గా మారనున్నట్లు తెలియజేసింది. దీన్నిబట్టి చూస్తే సమీప భవిష్యత్తులోనే నోకియా కాస్తా మైక్రోసాఫ్ట్ మొబైల్ గా దర్శనమివ్వనుందని అర్థమవుతోంది.

  • Loading...

More Telugu News