: హైదరాబాదు వస్తున్న ఆర్టీసీ బస్సులో మంటలు
వరంగల్ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ మండలం గోవర్ధన్ గిరి వద్ద ఆర్టీసీ ఇంద్ర బస్సులో మంటలు చెలరేగాయి. దాంతో, ప్రయాణికులు ప్రాణభయంతో బయటకు పరుగులు తీశారు. వరంగల్ నుంచి హైదరాబాదు వస్తుండగా బస్సులో ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాలు తెలియాల్సి ఉంది.