: పైలట్ చాకచక్యంతో తప్పిన పెను ప్రమాదం


పైలట్ నైపుణ్యంతో పెను ప్రమాదం తప్పిపోయింది. నిన్న రాత్రి 10.09 గంటలకు మలేసియాలోని కౌలాలంపూర్ విమానాశ్రయం నుంచి 159 మంది ప్రయాణికులతో బెంగళూరుకు విమానం బయల్దేరింది. టేకాఫ్ తీసుకున్న కొంత సేపటికి ల్యాండింగ్ గేర్ పనిచేయడం లేదని పైలట్ గుర్తించాడు. వెంటనే విమానాన్ని వెనక్కి తీసుకెళ్లి కౌలాలంపూర్ విమానాశ్రయంలో ఈ వేకువజామున 1.56 గంటల సమయంలో అత్యవసరంగా దింపేశాడు. గేర్ పనిచేయకపోయినా పైలట్ సురక్షితంగా విమానాన్ని ల్యాండ్ చేయడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. మలేసియా రవాణా మంత్రి కూడా పైలట్ ప్రతిభను మెచ్చుకున్నారు.

  • Loading...

More Telugu News