: ఆంధ్రప్రదేశ్ లో నేడు నామినేషన్ల పరిశీలన
ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు నామినేషన్ల పరిశీలన జరగనుంది. మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకుగాను 4173 నామినేషన్లు దాఖలుకాగా, 25 లోక్ సభ స్థానాలకు 573 నామినేషన్లు దాఖలయ్యాయి. ఈ వివరాలను ఎన్నికల కమిషన్ వర్గాలు అధికారికంగా వెల్లడించాయి. కాగా నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 23వ తేది తుది గడువు.